ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రికపై వివాదం

– ఈఓ, అర్చకుడి తీరుపై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల అగ్రహం

– ఆలయ ఈఓ, అర్చకుడు అవకతవకలకు అజ్యామిస్తున్నారని ఆరోపణలు 
– విధుల్లో నిర్లక్ష్యం వవహిస్తున్న ఈఓ, అర్చకుడిని తొలగించాలని డిమాండ్ 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ మూర్తుల ప్రాణప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికపై వివాదం రాజుకుంది. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమేయంలేకుండా ఆలయ ఈఓ విశ్వనాథ శర్మ,ప్రధాన అర్చకుడు మధుసూదన చారి భక్త బృందం పేరుతోఈ నెల 27 నుండి 29 వరకు లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ మూర్తుల ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం తలపెట్టడాన్ని శుక్రవారం ఆలయ అవరణం వద్ద కమిటి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ,ప్రధాన అర్చకుడు విధుల్లో వ్యవహరిస్తున్న వ్యవహరణపై ఆలయ అభివృద్ధి చైర్మన్ బండారి రాములు,సభ్యులు అగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.చైర్మన్ బండారి రాములు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను విస్మరించి ఆలయ ఈఓ,ప్రధాన అర్చకుడు కలిసి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులకు సమాచారం లేకుండా దాతల సహకారంతో లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ మూర్తుల ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించ తలపెట్టడం పలు అవకతవకలకు తావివ్వడమేనని అనుమానం వ్యక్తం చేశారు.దేవదాయ శాఖ నిబంధనలను దిక్కరించి ఆలయ ప్రధాన అర్చకుడు మధుసూదన చారి ఆలయ భక్తులకు అర్చక సేవలకు ఏకనామం పెట్టి ప్రయివేటుగా విధులు నిర్వహిస్తున్నారని ఈ తతంగమంత ఈఓ చూసిచూడనట్టు వ్యవహరించడం దేవాదాయశాఖ నిబంధనలను ఉల్లగించడమేనన్నారు.ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా దాతల సహకారంతో నిర్వహించ తలపెట్టిన ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి..ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న ఆలయ ఈఓ,ప్రధాన అర్చుకుడిని విధుల తొలగించాలని సభ్యులు డిమాండ్ చేశారు.ఆలయ ఈఓ, ప్రధాన అర్చకుడు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా పరిపాలనాధికారికి,దేవాదాయ శాఖాధికారికి పిర్యాదు చేయనున్నామని సభ్యులు తెలిపారు.
వివాదాలకు తావులేకుండా వ్వహరిస్తే అభివృద్ధి: భక్తబృందం వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ మూర్తుల ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం తలపెట్టారు.మంచి ఆరాద్యయోగమైన కార్యాక్రమని అదేశాలు ఇచ్చాం.ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను కలుపుకుని కార్యక్రమం నిర్వహించాలని భక్తబృందం సభ్యులకు సూచించాను. వివాదాలకు తావులేకుండా అందరూ సామరస్యపూర్వకంగా వ్యవహరించుకుంటే అభివృద్ధి బాగుంటది.ఆలయంలో ప్రధాన అర్చకుడు విధులు నిర్వరించడం లేదని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.అర్చుకుడిపై ఆలయ కమిటీ సభ్యులు తీర్మానం చేసి ఇస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – విశ్వనాథ శర్మ,ఆలయ ఈఓ ,బెజ్జంకి.
Spread the love