బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాలా కోసం డివిజన్లో కార్పొరేటర్లు డివిజన్ ఇన్చార్జిలు ప్రచారం

నవతెలంగాణ- కంటేశ్వర్ :
నిజామాబాద్ నగరం లోని అన్ని డివిజన్ లలో  బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు,డివిజన్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు శుక్రవారం తన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల గెలుపు కోసం నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, నాయకులు ఇంటింటికి తిరుగుతూ నగరంలో జరిగిన అభివృద్ధిని క్షుణ్ణంగా క్లుప్తంగా ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  ఎమ్మెల్యే గణేష్ బిగాల నాయకత్వంలో నిజామాబాద్ నగరం జరిగిన అభివృద్ధి ని ప్రజలకు వివరించి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
Spread the love