సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రం నామినేషన్‌కు తరలిరావాలి

– జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్‌
వైరా శాసనసభ నియోజకవర్గం నుంచి సిపిఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రం నవంబర్‌ 10న జరిగే నామినేషన్‌ సభ, ప్రదర్శనకు స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా సిపిఎం కార్యాలయం బోడేపుడి వెంకటేశ్వరరావు భవనం నందు గుడిమెట్ల మోహన్‌ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎంను ఎన్నికల్లో ప్రజలు బలపర్చాలని పిలుపునిచ్చారు. కొనుగోలు, అమ్మకాల రాజకీయలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. సమావేశంలో వైరా మాజీ ఎంపీపీ బొంతు సమత, సిపిఎం శాఖ కార్యదర్శులు మందడపు రామారావు, తోట కృష్ణవేణి, సినీయర్‌ నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరావు, ఎస్‌కె జమాల్‌, నారికొండ అమరేంద్ర, కంసాని మల్లిక, మాదినేని రజినీ, రుద్రాక్షల నర్సింహచారి, వడ్లమూడి మధు, షేక్‌ నాగుల్‌ పాషా, ముగ్గు సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.
భూక్యా నామినేషన్‌ ర్యాలీని జయప్రదం చేయండి
సిపిఐ(ఎం) వైరా నియోజకవర్గ అభ్యర్థి భూక్యా వీరభద్రం నామినేషన్‌ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌ నందు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నవంబర్‌ 10వ తేదీన ఉదయం 11 గంటలకు వైరా ఎంపీడీవో ఆఫీస్‌ రోడ్డు వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కురుగుంట్ల శ్రీనివాసరావు, గుడిమెట్ల మోహన్‌రావు, తోట కృష్ణవేణి, భూక్యా విజయ, మాదినేని రజినీ, మాదినేని ఉదరు తదితరులు పాల్గొన్నారు.

Spread the love