పేదలకు పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలలో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఐ(ఎం)

– ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి..
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు… కొండమడుగు నర్సింహ 
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఇల్లు లేని పేదలకు ఆనాడు ప్రభుత్వము ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన కాడ మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, వీధిలైట్లు, మంచి నీటి సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం  బస్వాపురం గ్రామంలో వార్డులను సందర్శించిన అనంతరం 2004 సంవత్సరంలో గ్రామంలోని ఇండ్లు లేని 80 మంది పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన భూమిని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వము సర్వే నెంబరు 88 నుండి 96 వరకు మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి 80 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి పంపిణీ చేయడం జరిగిందని, ఆ స్థలంలో మౌలిక వసతులు లేకపోవడంతో ఎల్లి ఎల్లని పరిస్థితులలో ఇండ్లు నిర్మాణం చేసుకోలేని పరిస్థితి ఏర్పడదని అన్నారు. నేడు ఆ 80 మంది కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురం చేస్తున్న పరిస్థితి ఉన్నదని ఇప్పటికైనా గ్రామ పంచాయితీ మరియు మండల స్థాయి అధికారులు బాధ్యత తీసుకొని ఆ ఖాళీ స్థలాలలో మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వం నుండి ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇంట్లో నిర్మించుకునే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్ల నిర్మాణం జరిగే వరకు లబ్ధిదారులకు సీపీఐ(ఎం) అండగ ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని వారు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సీపీఐ(ఎం) నాయకులు మధ్యపురం బాల్ నర్సింహ్మ,ఎమ్.ఏ. రైహిమాన్, లబ్ధిదారులు అన్నం  బాలమణి , అన్నంపట్ల లక్ష్మి , అన్నంపట్ల జంగమ్మ , అన్నంపట్ల జయమ్మ , అన్నంపట్ల యాదమ్మ , గాండ్ల నర్సింహ, మచ్చ శ్రీను, మల్యాల సత్తయ్య, రాసాల గంగరాజు, ఉడుత సాగర్, కడారి నర్సింహ, మచ్చ భాస్కర్ , మచ్చ బిక్షపతి, మచ్చ భూపాల్  లు పాల్గొన్నారు.
Spread the love