సీపీఎం గుడిసెలు తొలగించి బీఆర్‌ఎస్‌ జెండాలు నాటడమే దశాబ్ది ఉత్సవ కానుకా ?

నవతెలంగాణ-మట్టెవాడ
స్వరాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీపీఎం పేదలకు పంచిన భూముల్లో గుడిసెలను తొలగించి టిఆర్‌ఎస్‌ జెండాలు పెట్టించడం పేదలకు దశాబ్ది ఉత్సవాల కానుకనా అని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు నలి గంటి రత్నమాల, ఖిలా వరంగల్‌ శివనగర్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు.జూన్‌2 రాష్ట్రదశాబ్ది వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో సీపీ ఎం పార్టీ 321సరేవే నెంబర్‌లో 250గుడిసెలు వేయగా బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు నాయకులు సీ పీఎం పార్టీ గుడిసెవాసులపై బీఆర్‌ఎస్‌ కార్య కర్తల ను ఎగదోసి దాడి చేసిన సంఘటనను తీవ్రంగా ఖం డిస్తూ శుక్రవారం మాజీ ఏరియా కార్యదర్శి సారంగ పాణి అధ్యక్షతన కమిటీ సమావేశం ఏసీ రెడ్డి నగర్‌ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించినారు. ఈ కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడు తూ సీపీఎం ఇళ్ళూ లేని నిరుపేదలకు 58జీఓ ప్ర కారం 120 గజాల స్థలం, రూ.3 లక్షలు ఇస్తామం టూ ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వచ్చి న సీఎం లక్ష్యాన్ని నీరు గా ర్చేలా తూ ర్పు నియోజకవ ర్గం ప్రజా ప్రతినిధులు బి ఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యవ హరిస్తున్నారన్నారు. కా మ్రేడ్‌ రామసురేందర్‌ ఆశయాలకు అనుగుణంగా సర్వే నెంబర్‌ 321లోపేదలకు గుడిసెలను వేస్తే వాటిని ప్రాంతీయతత్వంతో రెచ్చగొట్టి ఖిలా వరంగల్‌ పెదలగుడిసెలను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ ఘటనపై బిఆర్‌ఎస్‌పై నాయకత్వం అరుహులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసిపట్టాలుఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో ఏరియా కార్య దర్శి పి.మహేందర్‌ కమిటీ సభ్యులు దుర్గయ్య , వేణు, అనిల్‌, ఉదరు, టి.వేణు, పాల్గొన్నారు.

Spread the love