వ్యవసాయాభివృద్ధికి రుణాల ఆర్థిక తోడ్పాటు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయాభివృద్ధిలో రైతులకు ఇచ్చే రుణాలు ఆర్థిక తోడ్పాటునందిస్తాయని ఏపీజీవీబీ మేనేజర్ మణికంఠ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు వివరించారు. బ్యాంకు నుండి అందించే సేవలపై అవగాహన కల్పించారు. స్థానిక వ్యవసాయ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం క్షేత్ర సందర్శనలో భాగంగా ఏపీజీవీబీ బ్యాంక్ ను సందర్శించారు.బ్యాంకు నుండి అందించే సేవలు, పనితీరు, వ్యవసాయ అభివృద్దిలో పాత్ర, రుణాల మంజూరు, రికవరీ, మొండి పద్దులు, ప్రభుత్వ సబ్సిడీలు వంటి అనేక సేవలను విద్యార్థులకు తెలియజేశారు. బ్యాంకు రైతులకే కాకుండా ఖాతాదారుల సంక్షేమానికి నాణ్యమైన సేవలు అందిస్తుందని, ఇందులో భీమా, ఆరోగ్య పధకాల అమలు గూర్చి తెలిపారు. క్షేత్ర స్థాయి పరిశీలనతోనే విద్యార్థుల నైపుణ్యం పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు శాస్త్రవేత్త కృష్ణ తేజ్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు సృజన లక్ష్మీ, విశ్వేశ్వరరావు,సందీప్,ప్రదీప్, బొమ్మ కిషోర్,పలువురు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love