రేపు అశ్వారావుపేటలో ఆయిల్ ఫెడ్ ఎం.డీ పర్యటన..

– ఏర్పాట్లలో నిమగ్నమైన స్థానిక అధికారులు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ లో కాంగ్రెస్ ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పరిపాలనా పరం అయిన సర్దుబాట్లు లో భాగంగా ఉద్యాన, పట్టు పరిశ్రమలు శాఖ సంచాలకులు అయిన  ఐఏఎస్ అధికారి కే.అశోక్ రెడ్డిని ఆయిల్ ఫెడ్ ఎం.డి గా ప్రభుత్వం నియమించింది. అశోక్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అనేక ప్రభుత్వ  శాఖల్లో ఉత్తమ పనితనం కనబరిచారు. ఈ క్రమంలో ఆయన మొదటి సారిగా మంగళవారం నియోజక వర్గం లోని దమ్మపేట మండలం, అప్పారావు పేట, అశ్వారావుపేట మండలంలో గల ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఫాం ఆయిల్ నూనె తయారీ పరిశ్రమలను, ఫాం ఆయిల్ కేంద్రీయ నర్సరీ లను ఆయన సందర్శించనున్నారు. ఈ నేపధ్యం లో సంస్థ డివిజనల్ మేనేజర్ బాలక్రిష్ణ,పరిశ్రమల మేనేజర్ లు కళ్యాణ్ గౌడ్,నాగబాబు లు ఆయన రాక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన వెంట జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి,పి అండ్ పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి లు పాల్గొననున్నారు.
Spread the love