విద్యుత్ ఘాతంలో అగ్నిప్రమాదం..పూరిల్లు దగ్ధం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ ఘాతం  కారణంగా ఒక పూరిల్లు దగ్ధమైన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది.  స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని ఆసుపాక కాలనీకి చెందిన కట్టం రాముడు పశువుల కాపుకు ఉదయమే ఇంటి నుండి వెళ్ళాడు. ఇంట్లో భార్య రమాదేవి చంటి బిడ్డతో ఉంది. కాగా మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో విద్యుత్ వైర్ లు కాలి మంటలు వ్యాపించడంతో గమనించిన రమాదేవి భయాందోళన తో చంటి బిడ్డతో సహా బయటకు పరుగులు తీసింది. క్షణాల్లోనే మంటలు వ్యాప్తి చెంది ఇంట్లో ఉన్న కూలర్, ఫ్రీజ్, టీవీ తోపాటు గృహోపకరణాలు అన్నీ కాలిపోయాయి. అలాగే ఇంట్లో ఉన్న రూ.20 వేల నగదు సైతం అగ్నికి ఆహుతి అయింది. బాధిత కుటుంబానికి కట్టు బట్టలే మిగిలాయి. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు సమీప ఇళ్లకు మంటలు అంటుకోకుండా ఆర్పారు. ఈ సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకోగా, అప్పటికే అంతా అగ్నికి దగ్ధం అయ్యాయి.
Spread the love