ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) అభ్యర్థులు నామినేషన్లు

నవతెలంగాణ హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు సీపీఐ(ఎం) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందుకు ఖమ్మం నగరంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హజరయ్యారు. ఆ సభలో రాష్ట్ర కార్యదర్శి, పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్ ఖమ్మం సమీకృత భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంటన ఆ పార్టీ కేంద్రకమిటి సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పొతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్ ఉన్నారు.

అశ్వరావుపేట నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా పిట్టల అర్జున్ రావు అశ్వరావుపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, సీఐటీయూ నాయకులు అప్పారావు, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.

మధిర నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా పాలడుగు భాస్కర్ మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love