SRH vs PBKS : మెరిసిన తెలుగు కుర్రాడు..పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ : ముల్ల‌న్‌పూర్ స్టేడియంలో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో స‌న్‌రైజ‌ర్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బ్యాటర్స్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి (64)  అద్భుత అర్ద సెంచరీ చేశాడు. సమద్ 12 బంతుల్లో 25 పరుగులు చేయగా హెడ్ 21, అభిషేక్  శర్మ 16, షాబాజ్ అహ్మాద్ 14 పరుగులు చేయడంతో 182 పరుగులు చేయగలిగింది హైదరాబాద్. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 4 వికెట్లు తీయగా కర్రన్, హర్షల్ పటెల్ రెండెసి వికెట్లు తీయగా రబడ ఒక వికెట్ తీశాడు.

Spread the love