అంగన్ వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లించాలి: సీఐటీయూ

నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్ వాడి టీచర్లు, హెల్పర్ లకు గ్రాట్యుటీ చట్టం పగడ్బందీ గా అమలు చేయాలని,పెన్షన్ రూ.6 వేలు  ఇవ్వాలని, అతి తక్కువ గ్రాట్యుటీ చెల్లించే జీవో రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ.. సీఐటీయూ  ఆధ్వర్యంలో సోమవారం ఐసీడీఎస్ సీడీపీఓ  రోజా రాణి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 10 ప్రకారం 65 సంవత్సరాలు నిండిన టీచర్లకు రూ.1 లక్ష రూపాయలు,హెల్పర్ లకు  కు రూ. 50 వేలు చెల్లిస్తామని జీవోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయటం దురదృష్టకరమని అన్నారు. గత సంవత్సరం అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని 24 రోజులు పాటు నిరవధిక సమ్మె సందర్భంగా నాటి మంత్రులు టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు,  60 సంవత్సరాల దాటిన వారికి  వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని కొత్త జీవో ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. నాటి పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా మెమో నంబర్ 1334 ఐసిడిఎస్ 1/ 2024 తేదీ0 3. 04 .2024 ను తక్షణమే ఉపసంహరించుచుకోవాలని సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడి టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు ఒక లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, 60 సంవత్సరాలు తర్వాత వీఆర్ఎస్ తీసుకునే సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ వేణి  తదితరులు పాల్గొన్నారు.
Spread the love