రాయగిరి మినీ ట్యాంక్బండ్ వద్ద భక్తుల సందడి..

– సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేసిన భక్తులు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ తిరుపతి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు మినీ ట్యాంక్ బండ్ రాయగిరి వద్ద సరదాగా కుటుంబ సభ్యులతో సేద తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి దేవాలయానికి భక్తుల తాకిడి  పెరిగింది. రాయగిరి కమాన్ నుంచి యాదాద్రి దేవాలయం వరకు భక్తులు రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్ల వద్ద సేదా తీరారు. ఇటీవల కాలంలో యాదాద్రి జిల్లాలో భువనగిరి జిల్లా కేంద్రంలో స్వర్ణగిరి దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, వాడయి గూడెం పరిధిలో సురేంద్రపురి దేవాలయం ఉండటంతో యాదాద్రి జిల్లా టెంపుల్ సిటీగా భక్తులతో కిటికీతలాడుతుంది . భువనగిరి బస్టాండ్ పరిసర ప్రాంతాల నుంచి యాదాద్రి బస్టాండ్ పరిసర ప్రాంతాల వరకు ఎదురు చూసిన భక్తులు కనబడుతున్నారు. ఆహ్లాదకరంగా రాయగిరి మినీ ట్యాంక్ బండ్… యాదాద్రి దేవాలయానికి వచ్చే భక్తులకు రాయగిరి వద్ద చెరువు మినీ ట్యాంక్బండ్ ఉండడంతో భక్తులు ఆ ప్రదేశంలో సేద తీరుతు , తమ వెంట తీసుకువచ్చిన టిఫిన్లను పలహారాలను భుజిస్తున్నారు. గుర్రపు జట్కా బండి ఎక్కుతూ  కుటుంబ సభ్యులతో ఆనందంగా  గడుపుతున్నారు.
Spread the love