ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు…

kavithaనవతెలంగాణ – హైదరాబాద్
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలుగా చేర్చింది. కవితను నిందితురాలుగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈనెల 26ను విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సమాచారం కోసం కవితను సీబీఐ ప్రశ్నించింది. దర్యాప్తు తరువాత కవితను నిందితురాలుగా సీబీఐ పేర్కొంది. 41-సీ కింద నోటీసులు ఇచ్చామని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో నిందితుల స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. 2022 డిసెంబర్ లో కవితను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఆమెను నిందితురాలుగా చేర్చకుండానే కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు అవుతారా..? లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే కవిత ఈ కేసులో ఉండటం విశేషం.

Spread the love