Friday, May 29, 2026
E-PAPER
Homeజాతీయంమే 31, జూన్‌ 6, 7 తేదీల్లోసీయూఈటీ యూజీ పరీక్షలు : ఎన్‌‌టీఏ

మే 31, జూన్‌ 6, 7 తేదీల్లోసీయూఈటీ యూజీ పరీక్షలు : ఎన్‌‌టీఏ

- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ – యూజీ) 2026 పరీక్షలకు సవరించిన పరీక్షల తేదీలను నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) గురువారం విడుదల చేసింది. తాజా షెడ్యూలు ప్రకారం..ఈ నెల 31, వచ్చే జూన్‌ 6, 7 తేదీల్లో సీయూఈటీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నెల 31న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడునవుతాయని, వాటిని cuet.nta.nic.in. అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్‌‌టీఏ సూచించింది. జూన్ 6, 7 తేదీల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చని వెల్లడించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు మే 28 ఈద్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్య ధోరణితో, లోపభూయిష్ట ప్రణాళికలతో అభ్యర్థలు జీవితాలతో చెలగాటమాడుతోందని ఇప్పటికే నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఎజెన్సీ (ఎన్‌‌టీఏ) విమర్శలు ఎదుర్కొంటోంది. విశ్వవిద్యాలయాల ప్రవేశాల పరీక్షల నిర్వహణలోనూ ఎన్‌‌టీఏ అదే విమర్శలు ఎదుర్కొంటోంది. పండుగలు, ముఖ్యమైన రోజులను పరిగణలోకి తీసుకొని సరైన ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాల్సివుంటుంది. కానీ ఎన్‌‌టీఏ మాత్రం ఈ దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురికావడం సాధారణంగా మారిపోతోంది. అందువల్ల పరీక్షల నిర్వహణ బాధ్యతలను సంబంధిత ఉన్నత విద్యా సంస్థలకు, ఆయా రాష్ర్టాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉందని నిపుణులు హితవు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ధోరణని విడనాడాలని, ఎన్‌‌టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -