బాన్సువాడ లో గంజాయి పట్టివేత….

నవతెలంగాణ-నసురుల్లాబాద్ 
బాన్సువాడ పట్టణ శివారు ప్రాంతంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు రైతుల పంపుతున్నట్లు, బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ, బాన్సువాడ టౌన్ సిఐ కృష్ణ తెలిపారు.  బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన పూర్తి వివరాల ప్రకారం పట్టణంలో ఒక వ్యక్తి యువకులకు గంజాయిని విక్రయిస్తున్నారనే  సమాచారం మేరకు బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని కొయ్యగుట్టలో సమీపంలో గల పి.ఆర్ గార్డెన్ వెనుక వైపు సీమల శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని, తనిఖీ చేయగా అతని వద్ద 120 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే అతన్ని పూర్తిస్థాయిలో విచారించగా బోధన్ పట్టణంలోని రాకాసి పేటకు చెందిన నస్రిన్ బేగం అలియాస్ సుమేరా భాను అనే మహిళ దగ్గర తాను గంజాయిని కొనుగోలు చేసినట్టు అతడు అంగీకరించాడు. వెంటనే బాన్సువాడ పోలీసులు బోధన్ పట్టణంలోని ఆమె ఇంటికి చేరుకొని, ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, ఆమె వద్ద 500 గ్రాముల గంజాయి లభ్యమైంది. వెంటనే ఆమెతో పాటు ఆమె మామ ఎండి రషీద్ ను  అదుపులోకి తీసుకొని విచారించగా, మహారాష్ట్రలోని నాయగావ్ అనే ప్రాంతం నుంచి తాను గంజాయిని కొనుక్కొచ్చినట్టు రషీద్ అంగీకరించాడు. దీంతో శ్రీకాంత్, నస్రిన్ బేగం, రసిద్ లను సోమవారం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించినట్టు డి.ఎస్.పి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు. చదువుకునే యువత మత్తు పదార్థాలకు బానిసలై, వారి జీవితాలని నాశనం చేసుకోవద్దని కోరారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి లాంటి ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయించిన, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్టు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి కేసును చాకచక్యంగా పరిశోధించి, నిందితులను అరెస్టు అయ్యేలా కృషిచేసిన  పోలీస్ సిబ్బందికి అభినందించారు.
Spread the love