ఆటపాటలతో అవగాహన కల్పించిన సాంస్కృతిక సారధి కళాకారులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కళాజాత బృందం ఆటపాటలతో అలరించారు. సోమవారం మండలంలోని పసర మరియు ముత్తాపురం గ్రామాలలో జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ  ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి రొంటాల కుమార్ బృందం చే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆటపాటలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడం జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, సమీపంలో ఉన్న అధికారులను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు కళాకారులు రేలా కుమార్, రాగుల శంకర్, గోల్కొండ బుచ్చన్న, ఈర్ల సాగర్, మార్త రవి, కనకం రాజేందర్, ఎండి రహీమొద్దీన్, బోడ కిషన్, రామంచ సురేష్, ఉప్పుల విజయ్ కుమార్, పొలెపాక తిరుపతి, గోల్కొండ నరేష్, ఉండ్రాతి భాస్కర్, కామెరదీపక్, మొగిలిచర్ల రాము, శ్రీలత, శోభ లు పాల్గొన్నారు.
Spread the love