ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ లో గల ఆల్పోస్ నరేంద్ర పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించినవి. ఈ సందర్భంగా పాఠశాలల ఛైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అంకితభావంతో, దృఢ నిశ్చయంతో, భారతదేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించినారని, దాని ఫలితంగానే భారత రాజ్యాంగాన్ని అతి తక్కువ సమయంలో రూపొందించి, ప్రపంచంలోనే భారత దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు. చిన్నారులు చేసిన భరతవాణి నీకు వందనము.. చెక్ దే ఇండియా..వందేమాతరం. తెలంగాణ జాగృతి.. తెలంగాణ జీవిద్దాం..ఆశయంతో జయిద్దాం.. ఆత్మవిశ్వాసంతో..నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love