దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

–  ప్రజాదర్బార్‌ లో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్‌ సాధన సమితి (డీసీఎస్‌సీఆర్‌ఎస్‌ఎస్‌) కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ లో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి సమితి నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అవలంభిస్తున్న ఎస్సీలను ఎస్సీలుగా గుర్తించారని, క్రైస్తవులను మాత్రమే బీసీ-సీలుగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. వీరిని కూడా ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన వారి ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఇశ్రాయేల్‌, ప్రధాన కార్యదర్శి బిషప్‌ ఎం.సామ్యేల్‌, కార్యవర్గ సభ్యులు ఎం.వీరయ్య జాన్సన్‌, నాయకులు జైపాల్‌ తదితరులున్నారు.

Spread the love