– వచ్చిన దరఖాస్తులు 4.03 లక్షలు
– 23 నుంచి ఎడిట్ ఆప్షన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రూప్-1 సర్వీసుల దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఇ నవీన్ నికోలస్ శనివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తుల్లో తప్పుల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 27వ తేదీ గడువు ముగిశాక దరఖాస్తుల్లో సవరణలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.