ప్రజలను మభ్యపెట్టేందుకే దశాబ్ది ఉత్సవాలకు తేర

– సీఎం కేసీఆర్ పై కవ్వంపల్లి మండిపాటు
-సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం
-మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యలయం ప్రారంభం
నవతెలంగాణ-బెజ్జంకి
రాబోయే ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే దశాబ్దాల ఉత్సవాల పేరిట సరికొత్త నాటకానికి సీఎం కేసీఆర్ తెరలేపారని కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా కవ్వంపల్లి మాట్లాడారు.రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రజలంధించిన అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాధనాన్ని వృథా చేసి దశాబ్దాల కాలం పాటు తరగని ఆస్తులను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కూటగట్టుకున్నారని ఆరోపించారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ దశాబ్దకాలం పాటు అధికారం కోసమే పాటుపడిందని.. రాష్ట్ర ప్రజలకు చేసిందేమిలేదని ఎద్దేవా చేశారు. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు అప్పుల కుప్పల రాష్ట్రంగా పేరుగాంచిదన్నారు. మరో సారి రాష్ట్రంలో అధికారం కోసం దశాబ్ద ఉత్సవాల పేరునా సుమారు 200 కోట్ల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అమరుల త్యాగాల మీద అధికారం చేపట్టి వారినే విస్మరించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదని అగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ద ఉత్సవాల రోజుల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠ చెబుతారన్నారు.అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహనికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్భంగా సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకులు పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శానగొండ శ్రావణ్, మాంకాళి ప్రవీణ్, ఒగ్గు దామోదర్, డీవీ రావు, మానాల రవి, అయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love