నోట్లతో ఓట్లు కొనే వాళ్ళను ఓడించండి..

– గిరిజన, గిరిజనేతరుల మేలు కోరే సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ గెలిపించండి
– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సుదర్శన్ రావు
నవతెలంగాణ- అశ్వారావుపేట:  ప్రతీ ఐదేళ్ళు కు జరిగే ఎన్నికల్లో పార్టీలు మార్చే రాజకీయ వ్యభిచారులను,ధనంతో ఓట్లు కొనుగోలు చేసి దానికి రెండింతలు ప్రజా ధనాన్ని దోచుకునే బూర్జువాల ఏజెంట్లు గా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అశ్వారావుపేట ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రజా సంఘాలు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల విజయాన్ని కాంక్షిస్తూ మండల కార్యదర్శి బి.చిరంజీవి అద్యక్షతన సోమవారం నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేట లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడారు. నిరంతరం సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగా నే ఈ నియోజక వర్గంలో పోడు పట్టాలు వచ్చాయని తెలిపారు. ఈ పోరాటంలో అర్జున్ కీలక భూమిక పోషించారని అన్నారు. గ్రామ పంచాయితీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పై అలుపెరుగని పోరు చేసింది సైతం అర్జున్ మాత్రమే అన్నారు.కరోనా సమయంలో లక్షల విరాళాలు సేకరించి గిరిజన, గిరిజనేతర పేదలకు నిత్యావసర సామాగ్రి అందించిన ఘనత సైతం సీపీఐ(ఎం) దే నని తెలిపారు. సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోతే నష్టపోయేది ప్రజలే నని అన్నారు. ప్రజావ్యతిరేక చట్టాలను చేస్తూ నరేంద్ర మోడీ నిరంకుశ పాలన చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో  భద్రాద్రి, ఏలూరు జిల్లా కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, రవి, అభ్యర్థి పిట్టల అర్జున్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బి చిరంజీవి నాయుడు, బి వీరభద్రం, మండల కమిటీ సభ్యులు సొడెం ప్రసాద్, తగరం నిర్మల, మడిపల్లి వెంకటేశ్వరరావు, జోగారావు, నాగేశ్వరరావు, జగన్నాథం, సత్యనారాయణ, సూరిబాబు, అర్జున్ లు పాల్గొన్నారు.
Spread the love