ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు ప్రకటనపై హర్షం ..

– సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్ర పటాలకు పాలాభిషేకం

నవతెలంగాణ – బెజ్జంకి 
ప్రభుత్వం ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు ప్రకటనపై మండల ముదిరాజ్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముదిరాజ్ సంఘ మండలాధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్ర పటాలకు ముదిరాజ్ కులసంఘ నాయకులు పాలాభిషేకం చేశారు. మండలంలోని అయా గ్రామాల ముదిరాజ్ కులస్తులు హజరయ్యారు.
Spread the love