డేసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ చాలన్ పరీశీలించిన ఎంపీడీఓ

నవతెలంగాణ – జుక్కల్

డేసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ చాలన్ ను జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ శనివారంనాడు పెద్దఎడ్గి,  పడంపల్లి గ్రామములో క్షేత్రస్థాయిలో  పరిశీలించారు. ఈ సంధర్భంగా పెద్ద ఎడ్గిలో జీపీ సెక్రట్రి రమేష్, ఎఫ్ఏ సుభాష్, ఉపాదీ కూలీలలతో పని చేస్తున్న ప్రదేశంలో ఎంపీడీఓ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొలతల ప్రకారం పనిచేసిన  వారికి కూలీ రోజుకు మూడు వందల రూపాయలు చెల్లిస్తామని అన్నారు. పనికి వచ్చి చెట్ల కింద సేద తీరి తిరిగి టైం పాస్ చేసే కూలీలకు ఇది వర్తించదని కూలీలలకు అవగాహన పర్చడం జర్గింది. పని చేస్తున్న ప్రదేశంలో సౌకర్యాలు సమకూర్చాలని, ఎండలో పని చేయవద్దని, ఉగయం పూట తొందరగా వచ్చి తల్లటి వాతావరణంలో పనులు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీవో తో పాటు పెద్ద ఎడ్గి జీపీ కార్యదర్శి రమేష్, ఎఫ్ఏ సుభాష్, పడంపల్లి ఎఫ్ఏ సూర్యకాంత్ తదితరులు పాల్గోన్నారు.
Spread the love