నవతెలంగాణ – జుక్కల్
కొలతల ప్రకారం పని చేస్తే పూర్తీ కూలీ అందిస్తామని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజు మండలంలోని దోస్పల్లి,బంగారుపల్లి, జుక్కల్ కేంద్రాలలోని ఉపాదీహమీ పనులను, నర్సరిలను, గ్రీన్ షేడ్, మాస్టర్ రోల్ ను పరీశీలించారు. ఈ సంధర్భంగా ఉపాదీ కూలీలకు పలు సూచనలు చేసారు. మండలంలోని గ్రామాలలో ఉపాదీహమీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని, ఏఫ్ఏలు ఇచ్చిన కొలతల ప్రకారం పనులను చేయాలని అన్నారు. అదేవిధంగా పనులు ఉదయం పూట చేపట్టాలని, ఎండలు పెర్గడంతో వడదెబ్బ తగులుతుందని, రక్షణగా ఉదయం వేళ పనులనప చేయాలని సూచించారు. పని ప్రదేశంలో డీహైడ్రేషన్ కు గురికాకుండా పని ప్రదేశంలో కూలీలకు ఓఆర్ఎస్ ప్రాకేట్లు అందించడం జర్గిందని తెలిపారు. కూలీలు నీటి వసతి కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడవో, దోస్పల్లి జీపీ సెక్రట్రిజాదవ్ మనోహర్, బంగారు పల్లి జీపీ సెక్రట్రి సతీష్, ఆయా గ్రామాల ఎఫ్ఏలు తదితరులు పాల్గోన్నారు.