బ్లాక్ స్పాట్ల గుర్తింపు..

– ప్రమాదాల నివారణకు చర్యలు..
– ఎన్ హెచ్ ఎ ఐ పిడి శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఏసిపి నారాయణ..
నవతెలంగాణ డిచ్ పల్లి: జాతీయ రహదారుల వెంట బ్లాక్ స్పాట్లను గుర్తించామని త్వరలోనే ప్రమాదాల నివారణకు చర్యలను చేపట్టడం జరుగుతుందని వాహనదారులు కూడా రాంగ్ రూట్లో వెళ్లకుండా చూడాలని అత్య రహదారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ అన్నారు గురువారం మండల కేంద్రంలోని ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ప్లాజాలో ప్రమాదల నివారణపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సరిహద్దుల వెంట బ్లాక్ స్పాట్లను ఇప్పటికే గుర్తించడం జరిగిందని కొన్నిచోట్ల అత్యవసరంగా ఉన్నవాటి వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా యూటర్న్ లను మూసివేయటం జరిగిందన్నారు. కొన్నిచోట్ల వందనాల నిర్మాణం జరుగుతుందని ఇంకా కొన్నిచోట్ల సర్విస్ రోడ్లు, ఇతర మార్గాలపై చర్చిస్తున్నామని వారన్నారు. వాన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీటు బెల్టుకోవాలని ఇదేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపి లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడపడితే అక్కడ చేసి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని,రంగ్ రూట్ లలో వచ్చి ప్రమాదాల బారిన పడి కుటుంబాలను కోలుకోకుండా చేస్తున్నారని, అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్, ఐఅర్ డిఎ వర్షా,ఐటీ రామారావు,సెప్టి మేనేజర్ సతీష్ పానుగంటి తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love