– వనదేవతలను దర్శించుకుంటున్న భక్తులు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర శుక్రవారం భక్తజన సంద్రమైంది.మండలంలోని అయా గ్రామాల భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భారీగా తరలివచ్చారు.భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలిరావడంతో భద్రతను ఎస్ఐ క్రిష్ణారెడ్డి పర్యవేక్షించారు.
దర్శించుకున్న పీఏసీఎస్ చైర్మన్: వడ్లూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావుకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.