బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం : చిరుమర్తి 

నవతెలంగాణ- నకిరేకల్ 
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మండలంలోని చందుపట్ల మండలపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కటిక చీకట్లు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ గౌడ్, షీప్ అండ్ గొట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి  కుమార్ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ గు డుగుంట్ల లక్ష్మమ్మ శంభయ్య, ఎంపీటీసీ ఇమ్మడపాక లక్ష్మీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love