అభివృద్ధికే ప్రజల బ్రహ్మరథం

– విప్‌ రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు. మండలంలోని కోయగూడెం, తాళ్ల గోమ్మూరు, సారపాక గ్రామపంచాయతీలలో సుమారు రూ.2.50 కోట్లతో ఎస్‌డీఎఫ్‌ నిధులతో నిర్మించిన 46 సీసీ రోడ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. రేగా హాజరై బైక్‌ పై విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలతో రాష్ట్రం పచ్చగా కలకలాడుతుందని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ సర్కార్‌ పెద్దపీట వేస్తున్నదని ఆయన అన్నారు.
కాంగ్రెస్‌ నుంచి 100 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరిక
నకిరిపేట గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుమారు 100 కుటుంబాలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి రేగా కాంతారావు ఆహ్వానించారు. లక్ష్మీపురం గ్రామంలో వీరంతా రేగా సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గోనెల నాని, పార్టీ జిల్లా నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.

Spread the love