
– కళ్లేపల్లిలో పశువైద్య శిభిరం
నవతెలంగాణ-బెజ్జంకి
పిండ మార్పిడి శాస్త్రీయ ప్రయోగం వల్ల ఆవుల సంతతి అభివృద్ధితో పాటు అధిక పాల ఉత్పత్తి పొంది ఎక్కువ నికర ఆధాయాన్ని పాడి రైతులు పొందవచ్చునని పీవీ నర్సింహా రావు పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రామచంద్రా రెడ్డి సూచించారు.సోమవారం మండల పరిధిలోని కళ్లేపల్లిలో సహివాల్ ఆవులకు శాస్త్రీయ పిండ మార్పిడి పశువైద్యం శిభిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాంచంద్రా రెడ్డి మాట్లాడుతూ దేశవాలి ఆవుల సంతతి అభివృద్ధి చేయుటకు పీవీ నర్సింహా రావు పశు వైద్య విశ్వవిద్యాలయం వారు రాష్ట్రీయ గోకుల్ మీషన్ ద్వార పిండి మార్పిడి శాస్త్రీయ ప్రయోగం చేపట్టారని పాడి ఆవుల యాజమానులు సద్వినియోగం చేసుకుని ఆవుల సంతతి అభివృద్ధికి పాటుపడాలన్నారు.పశు వైద్య శిభిరంలో సుమారు 102 ఆవులను పరీక్షించి 14 ఆవులను ఎంపిక చేశామన్నారు. పశు వైద్యాధికారులు కీర్తన,శ్రీకాంత్ రెడ్డి,కరీంనగర్ డైరీ సిబ్బంది రాజు,సృజన్, రైతులు పాల్గొన్నారు.