ఎంపీ తో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం

నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితోనే  దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్య మని దుబ్బాక నియోజకవర్గ యువజన విభాగం నాయకులు దమ్మగౌని ప్రశాంత్ గౌడ్ అన్నారు. బుధవారం నూతన అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డిపేట లో విలేఖర్లతో మాట్లాడారు. గత ఉప ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాయ మాటలు నమ్మి యువత మోసపోయారని , ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని నమ్మి యువత ఎంపీ సమక్షంలో భారీగా చేరుతున్నారని అన్నారు. దుబ్బాక లో తిరిగి మెదక్ ఎంపీ నీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించడం కోసం యువత సిద్దంగా ఉన్నారని అన్నారు
Spread the love