మాట‌ల్లొనే మైనార్టీల అభివృద్ది

మాట‌ల్లొనే మైనార్టీల అభివృద్ది– బడ్జెట్‌ కేటాయింపుల్లో వివక్ష
– డబుల్‌ బెడ్‌రూమ్‌లకోసం ఎదురుచూపు
– రుణాల కోసం కార్పొరేషన్‌ చుట్టూ చక్కర్లు
– పోరాటాలతోనే సర్కారులో కదిలిక..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముస్లిం మైనార్టీల్లో సంచార, అర్ధ సంచార జాతులైన తురక కాశ ,పకీర్‌ ,గారెడివాలా ,అత్తర్‌ సాయి బులు, ఎలుగుబం టివాలా , బోరెవాలా, గంటె టవాలా, బందర్‌ కిలానే వాలా , సాంపుకిలానెవాలా, బుగ్గ వాలా తదితర తరగ తులవారు సుమారు 10 లక ్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. వీరంతా చాలా దుర్భరమైన జీవితా న్ని గడుపుతున్నారు. విద్యా, ఉపా ధిలో అధమస్థానంలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామాలు తిరుగుతూ భిక్షాటన మీద ఆధారపడి బతుకుతున్నారు. చిన్నచిన్న వృత్తులు చేసుకుంటూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలేవి వారి దరికి చేరడం లేదు.ఆవాజ్‌ ఈ సమస్యల పరిష్కారం కోసం పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించింది. పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలను సాధించింది.
పోరాటాలతోనే ప్రభుత్వంలో కదిలిక..
మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, ఆ సమస్యలపై నిర్విరామంగా ఆవాజ్‌ పనిచేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాలను గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వేలు నిర్వ హించింది. ఆ తర్వాత సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు చేపట్టింది. జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌, జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా మైనార్టీలకు బడ్జెట్‌ సబ్‌ ప్లాన్‌ , రిజర్వేషన్‌ అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించింది. అన్ని మైనార్టీ సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించటం మూలంగానే ఈ మాత్రమైనా బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. రిజర్వేషన్ల అంశంలో కదలిక వచ్చింది. మైనార్టీ కమిషన్‌ తదనంతరం బీసీ కమిషన్‌ ఏర్పాటుకు దారితీసింది. ఉద్యోగులు, మధ్యతరగతి, విద్యార్థులు ,యువ కుల్లో ఆవాజ్‌ పోరాటాల పట్ల సానుకూలత పెరిగింది.
ఎండమావిగా కార్పొరేషన్‌ లోన్లు..
చిరు వ్యాపారులు, నిరుద్యోగులు స్వయం ఉపాధికోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి ప్రత్యక్ష రుణాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ..ప్రభుత్వం కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించి, వారికి రుణాలు అందిం చటంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నది.దీనిపై పలు సార్లు ఆందోళనలు జరిగాయి. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర కార్యాలయం ముట్టడి జరిగింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కొందరికి మాత్రమే లోన్లు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ లోన్లు ఇవ్వాలని ఆందోళన నిర్వహించాల్సి ఉంది.
సొంతింటి కల కలగానే..
రాష్ట్రంలో 45శాతం ముస్లిం మైనార్టీ కుటుంబాలకు సొంతిల్లు లేదు. వారు ప్రభుత్వం ఇస్తానన్న డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లకోసం కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. అర్హత కలిగిన అందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని ఆవాజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది.ఈ కార్యక్రమాల్లో మహిళలు అత్యదికం గా పాల్గొన్నారు. అర్హత కలిగిన అందరికీ ఇం డ్లు కేటా యిస్తామంటూ ప్రభుత్వం మభ్య పెడుతున్నది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సి ఉంది .

Spread the love