బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి..

– కల్లెపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దారం తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు  
– మండలంలో జోరందుకున్న బీఆర్ఎస్ ప్రచారం 
నవతెలంగాణ-బెజ్జంకి
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని..
మూడోసారి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రసమయి ఎన్నికే లక్ష్యంగా పనిచేస్తామని మండల బీఆర్ఎస్ నాయకుడు దారం తిరుపతి రెడ్డి దీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే రసమయి గెలుపు కోసం దారం తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఒంటేల సంపత్ రెడ్డి,అయిల పాపయ్య, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.అనంతరం బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మండలాభివృద్ధికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎనలేని కృషిచేశారని..అభివృద్ధిని గుర్తించి ప్రజలు రసమయి బాలకిషన్ ను భారీ మేజారీటీతో గెలిపించాలని తిరుపతి రెడ్డి కొరారు.మండల,గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లో పలువురి చేరికలు..
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన వార్డ్ సభ్యుడు ముక్కీస శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పల్లే శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ నాయకుడు వనపర్తి నర్సింహ చారి సర్పంచ్ ముక్కీస తిరుపతి, మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి,సీనియర్ మండల నాయకుడు ముక్కీస రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ, ఎఎంసీ డైరెక్టర్ ముక్కీస తిరుపతి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ముక్కీస తిరుపతి రెడ్డి అధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన వ్యవసాయ క్షేత్రం అవరణంలో పార్టీలో చేరిన అయా పార్టీల శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధి చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు అయా పార్టీల శ్రేణులు తెలిపారు.మండల,గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జోరందుకున్న బీఆర్ఎస్ ప్రచారం..
మండలంలోని అయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం బుధవారం జోరందుకుంది.మండల కేంద్రంలో టౌన్ అధ్యక్షుడు వంగాల నరేశ్, బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో సర్పంచ్ టేకు తిరుపతి అధ్వర్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.అయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love