
– 4 నెలలకో సారి గ్రామసభలు….
– ఎంపీపీ జల్లిపల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం మండలంలోని అచ్యుతాపురం లో స్థానిక సర్పంచ్ యాట్ల నాగలక్ష్మి అద్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన ప్రారంభ సభను లాంచనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసిందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరు గృహ జ్యోతి, మహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా,చేయూత పధకాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలను కోరారు.ధరాస్తులు పరిశీలన కోసం దరఖాస్తుదారుల నివాసాలకు అధికారులు వచ్చి పరిశీలన చేసి లబ్దిదారులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అలాగే ప్రతి 4 నెలలకు ప్రజాపాలన గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వార మహిళలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి,ఎం.పి.టి.సి కాసాని దుర్గ,అదనపు కలెక్టర్,నియోజకవర్గ ఇన్ చార్జి మాదవి,పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి,మండల ఇంచార్జీ పురంధర్,ప్రజాపాలన బృందం నేత,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ, ఆర్.ఐ పద్మావతి,కార్యదర్శి దార బోయిన వెంకటమ్మ ప్రజాపాలన సిబ్బంది పాల్గొన్నారు.