
ఢిల్లీలో రైతులు చేస్తున్న న్యాయం పోరాటంపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో చేస్తున్న దమనకాండను వెంటనే నిలిపివేయాలని ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ విలేకరుల సమావేశంలో సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు గతంలో చేసిన పోరాటాల ఫలితంగా ప్రధాని మోదీ షరతులకు ఒప్పుకొని క్షమాపణలు చెప్పారు కానీ పూర్తిస్థాయిలో డిమాండ్లను నెరవేర్చలేదని అన్నారు. రెండవ దఫా దీక్షలకు దిగిన రైతులపై టియర్ గ్యాస్, భారీకేడ్లు, మొలలు వేసి అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. రైతులను ఢిల్లీకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయడం సరి కాదని కాబట్టి వెంటనే రైతుల డిమాండ్లను పరిష్కరించే దిశగా కేంద్రం చొరవ చూపాలని లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గంగాధర్, సలహాదారు కిషన్ తదితరులు పాల్గొన్నారు.