‘ధరణి’తెచ్చిన చిక్కు..

-ఒకరి భూమి మరొకరికి బదీలైన వైనం 

-రెండేండ్లుగా అధికారుల చుట్టూ పట్టాదారుడి ప్రదక్షిణలు 
-ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని రైతు దంపతుల విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ధరణి’వల్ల నిరుపేద రైతులకు తిప్పలు తప్పడం లేదు.ఒక రైతు భూమి మరొక రైతు పేరునా బదీలవ్వడంతో బాధిత రైతు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.గత రెండేండ్లుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసిన సమస్య పరిష్కారమవ్వక తీవ్ర ఆందోళనక గురవుతున్నారు అసలు పట్టాదారు రైతు దంపతులు. మండల పరిధిలోని దాచారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 229/బీ యందు సుమారు 0.36 గుంటలు,362/బీ యందు సుమారు 0.27 గుంటలు  భూమిని పెద్ది లక్ష్మి వద్ద నుండి రూ.1,60,000 ధరకు దయ్యాల బీరయ్య 2013, మార్చి 2న కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.భూముల సంరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ యందు సర్వే నంబర్ 229/బీ యందు ఉన్న సుమారు 0.36 గుంటల భూమి స్థానిక అమరగొండ రాజు పేరునా బదిలీ అయింది.బాధిత రైతు దయ్యాల బీరయ్య తన కూతురి వివాహనికి భూమిని విక్రయించడానికి యత్నించగా తన భూమి మరొకరి పేరునా బదిలైనట్టు తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.తన భూమి బదిలీ అయిన రైతు అమరగొండ రాజును మా భూమిని యథావిథిగా అందించాలని ప్రాదేయపడిన కనికరించకుండా బెదిరింపులకు గురిచేస్తూ తన భూమిని అక్రమంగా పట్టా చేయించుకోవాడానికి యత్నిస్తున్నాడని బాధిత రైతు దంపతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి అధికారులతో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అధికార పార్టీ పేరుతో బెదిరింపులు 
తమ భూమిని తమకు బదిలీ చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తే మాది అధికార ప్రభుత్వమని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండి అంటూ నేను భూమి మీకు చేయనని మా భూమి బదిలీ అయిన రైతు అమరగొండ రాజు బెదిరింపులకు పాల్పడుతున్నార .మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి నిరుపేద రైతు కుటుంబమైన మాకు న్యాయం చేయాలి.
-దయ్యాల సుగుణ బీరయ్య,బాధిత రైతు దంపతులు,దాచారం.
Spread the love