దళితబంధును దళారుల పరం చేయవద్దు : డీహెచ్‌పీఎస్‌

నవతెలంగాణ-మట్టెవాడ
దళితుల అందరికీ దళిత బంధు ఇస్తామని చెప్పి ఏడాది గడుస్తున్న సీఎం కెసిఆర్‌ మాటలు నేటికీ అమలు కాలేదని డి హెచ్‌ పి ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మారుపాక అనిల్‌ కుమార్‌ అన్నారు. గురువారం సంఘీ ఏలేందర్‌ అధ్యక్షతన శివనగర్‌ లోని స్థానిక తమ్మెర భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చే సిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే కాపలా కుక్కగా ఉంటానని, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, ప్రతిపేదవారికి మూడెకరాల భూమి ఇస్తానని , మోసంచేసి 9ఏళ్లు అయింద న్నారు. దళిత బందు ఇస్తా మని చెప్పి కొందరికే యిచ్చారని, దళితబంధు అ ర్హులకు కాకుండా పోతుం దని ఈ పథకం దళారుల పరం అవుతుందని అన్నారు. దళితబంధు అర్హుల ఎంపిక మంత్రి క్యాంపు ఆఫీసుల్లో కాకుండా గ్రామ సభలుపెట్టి అర్హులకు ఇవ్వాలన్నారు.స్వాతంత్య్రం తర్వాత రాజకీయ నాయకులు ఎంపిక చేయడం ఇదే మొదటి సారి అని ప్రతి పథకం ప్రభుత్వ అధికారుల ద్వారా అమలు చేయబాడిందన్నారు.
మండలంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలన్నారు దళితబంధులో రాజకీయ జోక్యం అరికట్టలన్నారు పారదర్శకంగా ప్రజాస్వామ్య యుతంగా ఇవ్వాలన్నారు గతంలో నియోజకవర్గా నికి 500చొప్పున వస్తే గ్రామదళితులకు తెలియ కుండా అడ్డగోలుగా పంచుకున్నారని చెప్పారు రూ. 17700 కోట్లు విడుదల చేశామని చెబుతున్న ప్రభు త్వం అర్హులకే ఆ నిధులు చెందలన్నారు. దళిత బం ధు దళారుల బంధు కావొద్దన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు దళిత బంధు లబ్ధిదారుల నుండి లంచాలు వసూలు చేయడం మానుకోవలన్నారు.
దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి వచ్చే వరకు దళితులను ఐక్యం చేసి పోరాడుతామని స్ప ష్టం చేశారు. యువతకు ఉపాదిలేక ఇబ్బందులు ప డుతున్నారని వారిని గుర్తించి దళితబంధు మంజూరి చేయాలన్నారు. దళితులు తరతరాలుగా అనుభవిస్తు న్న అసైన్డ్‌ భూములకు ధరణి పట్టా పాస్‌ బుక్‌ లు ఇ వ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో స్వాతంత్య్రం వచ్చి న 75 ఏళ్ల తర్వాత కూడా దళితులు తీవ్ర వివక్షకు గు రికావడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజ ర్వేషన్ల ఎత్తివేతకు కుట్రలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దళితులకు లబ్ధి చేకూర్చే 27 పథకాలనురద్దు చేసిందని ఆం దోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు జన్ను రవి, గుండె బద్రి, గన్నారపు రమేష్‌, మచ్చ సుధీర్‌, ఆ రోగ్యం, బత్తుల సుప్రియ, యాకయ్య, మహేష్‌, దేవ పాల, శంకర్‌, పైడి తదితరులు పాల్గొన్నారు.

Spread the love