‘దళితబంధు’తో ఆర్థికంగా స్థిరపడాలి : ఎమ్మెల్యే అరూరి రమేష్‌

నవతెలంగాణ – ఐనవోలు
దళిత బందు పథకాన్ని సద్వినియోగంయ చేసుకుని దళితులు ఆర్థికంగా ఎదగాలని వర్దన్నపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షులు, అరూరి రమేష్‌ అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెంకు చెందిన లబ్ధిదారులకు దళితబందు ద్వారా మంజూరైన 9ట్రాక్టర్లను హన్మ కొండ హంటర్‌ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యా లయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి పొందటమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పించాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దళితులు బీఆర్‌ఎసకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపిపి మార్నెని మధుమతి, ఎస్సి కార్పొరేషన్‌ ఈడీ మాధవి, జడ్పి కో ఆప్షన్‌ ఉస్మాన్‌ అలీ, మండల కో ఆప్షన్‌ గుంశావాలి, సర్పంచ్‌ రజిత, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చందర్‌ రావు, మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్‌ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్‌, ఐనవోలు ఆలయ చైర్మన్‌ మజ్జిగ జైపాల్‌, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ఐనవోలు ఆలయ మాజీ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love