వ్యక్తి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు 

నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
బతుకు దెరువు కోసం పని వెళ్తున్నానని వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘట దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ వి. గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పెద్ద గుండవెళ్లి గ్రామానికి చెందిన ఆటగారి యాదగిరి (35) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 11న భార్య భాగ్యమ్మ పిల్లలతో కలిసి రాత్రి 10 గంటలకు భోజనం చేసి పడుకున్నాడు. తిరిగి 11:30 గంటలకు ఇంట్లో ఫోన్ కు ఫోన్ చేసి బతుకు దెరువు కోసం వెళ్తున్నాని చెప్పి కట్ చేశాడు. ఆతర్వాత సిద్దిపేటలో ఉన్నానని ఫోన్ చేసి కట్ చేశాడు. దీంతో తిరిగి కుటుంబీకులు ఫోన్ చేయడంతో స్విచ్చాఫ్ వచ్చిందన్నారు. కంగారు పడిన భాగ్యమ్మ, వారీ కుటుంబ సభ్యులు చుట్టు ప్రక్కల వెతికినా, బంధువులకు సమాచారం అందించిన అతడి ఆచూకీ లభించలేదు.యాదగిరి భార్య బాగ్యమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.తన భర్త ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు షర్ట్, నలుపు రంగుపొంట్ ధరించగా…. కోల ముఖం చామనిచాయ రంగు కలిగి  ఉండి 5 అడుగుల ఎత్తును  కలిగి ఉన్నాడని ఫిర్యాదు లో పేర్కొంది. ఎవరికైనా ఆచూకీ లభిస్తే దుబ్బాక పోలీస్ స్టేషన్ కి గానీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ తెలియజేయాలని ఎస్ ఐ గంగరాజు వెల్లడించారు
Spread the love