నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ఎరడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలలోని 8 మంది విద్యార్థులకు బ్యాగులు, జామెట్రీ బాక్సులు, నోటుబుక్కులు, కలర్ పెన్సిల్లు మరియు పెద్ద బాలశిక్ష లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తూ మరియు బాగా చదివే విద్యార్థులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల లో చదువుకునే పేద మరియు బాగా చదివే విద్యార్థులకు సహాయం చేయడమే మా సంస్థ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కర్ల భూoరెడ్డి,మరియు ఉపాధ్యాయులు శ్రీ జస్బీర్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.