ఆళ్ళపల్లి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ

– కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
– ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ లంకపల్లి వీరభద్రం అధ్యక్షతన ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఆళ్ళపల్లి మండల ఆడపడుచులకు సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, తహసీల్దార్ మాట్లాడుతూ.. ఆళ్ళపల్లి మండల ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. మండలానికి రావాల్సిన వందశాతంలో బతుకమ్మ చీరలు ప్రస్తుతం 60% వచ్చాయని, మిగిలిన 40% చీరలు అతి త్వరలో వస్తాయని, రాగానే ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టుకున్న ఏడుగురు లబ్ది దారులకు (ఒక్కోటి రూ.1,00,116/-ల విలువ) ఏడు చెక్కులను ఎంపీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సీ.హెచ్.అనుష, ఆళ్ళపల్లి, మర్కోడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు సోయం రామయ్య, తాటి బుల్లిబాబు, వార్డు సభ్యులు మొహమ్మద్ ఖయ్యూం, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కసనబోయిన నరేష్, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love