బాలికల హాస్టల్ లో దుప్పట్ల పంపిణీ

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పట్టణం బీసీ కాలనీలోని ఎస్సి బాలికల హాస్టల్ ఆదివారం, యాదగిరిగుట్ట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మచ్చ నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో బాలికలకు దుప్పట్లను ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మచ్చ నరసింహ గౌడ్ సేవా దృక్పథాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ రేగు బాల నరసయ్య యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, హాస్టల్ వార్డెన్ సోనీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు బందారపు బిక్షపతి గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love