నవజాత శిశువులకు దుస్తులు పంపిణీ

– పేద ప్రజలకు నర్సులు చేస్తున్న సేవ మరువలేనిది
– ఆర్‌ఎంఓ డాక్టర్‌ వై.రాజశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలంరూరల్‌
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, మదర్స్‌ డే సందర్భంగా మదర్‌ తెరిసా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నవజాత శిశువులకు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ వై. రాజశేఖర్‌రెడ్డి, సీనియర్‌ నర్సు దుర్గ భవాని చేతులు మీదుగా ఒక్కొక్క శిశువుకి రెండు జతలు చొప్పున 30 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పిల్లల వైద్య నిపుణులు ఆర్‌ఎంఓ వై .రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ…అంతర్జాతీయ నర్సులు దినోత్సవం సందర్భంగా నవజాత శిశువులకు దుస్తులు పంపిణీ చేసిన నిర్వాహకులను మదర్‌ థెరిస్సా ట్రస్ట్‌ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కొప్పుల మురళి మాట్లాడుతూ. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వైద్యరంగంలో కీలకమైన నర్సు మతికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకువచ్చిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలియజేశారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులకు కేంద్ర బిందువైన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లోని నర్సులు నిజంగా సేవామూర్తులే అని సేవలను కొనియాడారు. రోగి ఆస్పత్రికి వచ్చిన దగ్గర నుంచి కోలుకుని ఇంటికి వెళ్లేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. కరోనా సమయంలో వైద్యులతో పాటు నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివి. వైద్యులు ఇచ్చే మందులు, చికిత్సతో పాటు రోగి ఒక వ్యాధి నుండి కోలుకోవడానికి సరైన సంరక్షణ ఎంతగానో దోహదం చేస్తుందనీ తెలిపారు. ఇందులో 24 గంటలూ రోగి సంరక్షణలో నిమగమైన వైద్యుల కంటే నర్సులదే పెద్ద బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కొప్పుల మురళి, ట్రస్ట్‌ సభ్యులు చోళ ఇన్సూరెన్స్‌ మేనేజర్‌ బాలరాజు, బూరం నవీన్‌, సాయి కుమార్‌, జయరాం హాస్పిటల్‌ నర్సు కష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love