పట్టణంతో పాటు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ ఆర్మూర్ : పట్టణంలోని రెండవ వార్డ్ ,ఆలూరు మండల కేంద్రంలోని మండలంలోని ,సుర్బిర్యాల్ గ్రామంలోని శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ నిర్వహించినారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాందేశ్ సంగీత ఆలూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,ఉప సర్పంచ్ శ్రీనివాస్, సుర్పిరియాల సర్పంచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పెర్కిట్ నాలుగవ వార్డులో పియుసి చైర్మన్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినారు.. ఇట్టి కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ నచ్చు చిన్నారెడ్డి, 4వ వార్డు అద్యక్షులు కామని నరేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సొన్న నర్సింలు, రైతు విభాగం అధ్యక్షులు పెద్దకాపు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love