ప్రేరణ ఫౌండేషన్
నవతెలంగాణ-గోవిందరావుపేట

హైదరాబాద్ ప్రేరణ పౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు బుధవారం మండలంలోని పసర వడ్డెర కాలనీ మరియు ప్రాజెక్టునగర్ గ్రామాల ప్రజలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులలో ఒకరైన శరత్ బాబు మాట్లాడుతూ మేము హైదరాబాదు ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మది అనాధ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేస్తామని అన్నారు. వాస్తవానికి ఈ ఫౌండేషన్ అమెరికాలోని తెలుగు అసోసియేషన్ మరియాల్యాండ్ కు చెందిన ఓరుగంటి అనురాధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. అనురాధ ద్వారా ఇచ్చే విరాళాలతో తాము మీలాంటి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో కూడా చేతనయినంత సహాయాన్ని అందిస్తామని అన్నారు. బడికి వెళ్లి సాయంత్రం వేళలో ట్యూషన్ కు ఫీజులు కట్టలేని పిల్లలకు ట్యూషన్ ఫీజులు కడతామని పిల్లలు అధికంగా ఉంటే తామే ఒక ట్యూటర్ను నియమించి ట్యూషన్ చెబుదామని అన్నారు. మీ పిల్లల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఎవరైనా ముందుకు వస్తే గౌరవ వేతనం ఇచ్చి ట్యూటర్ గా నియమిస్తామని అన్నారు. వరదల పరిస్థితుల వల్ల ములుగు జిల్లా అధికంగా నష్టపోయిందని తెలుసుకున్న మేము మాకు తోచిన సహాయాన్ని అందించాలని మీకు ఈ చిన్న సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు జీవన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.