
మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో వరదల వల్ల నష్టపోయిన 80 కుటుంబాలకు బుధవారం హైదరాబాద్ వడ్డేపల్లి ట్యాంక్ బాండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో అకాల వర్షాల వలన వరద ఉధృతికి ఇండ్లు మునిగిపోయిన 80 కుటుంబాల వరద బాధితులకు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క పిలుపు మేరకు వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే వరదల వల్ల నష్టపోయి ఇండ్లు కూలిపోయిన బాధితుల కోసం సీతక్క చేసే సేవల వల్ల మేము కూడా తమ వంతగా సేవ చేయాలని మా సభ్యులం అందరం వచ్చి వరద బాధితులకు సహాయపడటం చాలా సంతోషంగా అనిపించింది అని అన్నారు. భగవంతుడు మీకు మరిన్ని సహాయ సహకారాలు అందించి మీ జీవితాలను మంచి మార్గంలోకి మళ్లించి ఆదుకుంటారని అన్నారు.. డా. సీతక్క మా నియోజకవర్గ ప్రజలు ఆపదలో ఉన్నారు ఆదుకోండి అని పిలిచినా పిలుపుమేరకు మీ అందరి కష్టంలో మేము పాల్గొని, మా వంతు సహాయం చేయడానికి వచ్చామని, నిజంగా సీతక్క సహృదయులు అని, ములుగు నియోజక వర్గ ప్రజల కష్టాల్లో తను ముందుండి, మీకోసం ఎంతగానో కష్టపడుతున్న వ్యక్తి అని, సీతక్క సేవాభావానికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాము అని, నిరంతరం ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా మీకోసం బ్రతుకుతున్న వ్యక్తి అని, వారి పిలుపుమేరకు మేము ఇక్కడికి వచ్చామని, మీ అందరికీ ఒక నెలకు సరిపడ బియ్యం, కూరగాయలు, వంట సరుకులు, వంట సామాగ్రి, అన్ని రకాలు తీసుకుని వచ్చామని, మీ అందరి ఆపదలో మేము ఉంటామని, సీతక్క మీకు ఎమ్మేల్యే అవడం మీ అదృష్టమని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మేల్యేగా మీ కోసం సీతక్క చేస్తున్న పోరాటం అమోఘం అని అన్నారు. అనంతరం నిత్యావసర సరుకులు 80 కుటుంబాలకు అందించి సహృదయాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సనప సమ్మయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, గ్రామ అధ్యక్షులు అలుగుబెల్లి కన్నయ్య, వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మహమూద్ అలి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రావు, చందు తదితర నాయకులు పాల్గొన్నారు.