- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామంలోని ప్రిప్రైమరి పాఠశాతోపాటు జిల్లా పరిషత్ హైస్కుల్లో 2026-27 విద్య సంవత్సరం చదువుల కోసం విద్యార్థులకు నోట్ బుక్స్ గ్రామ సర్పంచ్, బండారి నర్సింగం, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపేట వేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న బోజనం, అర్హులైన ఉపాధ్యాయులచే మేరుగైన విద్య బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనిలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



