పెన్షన్లు పంపిణీ..     

నవతెలంగాణ- చివ్వేంల: సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో  పెన్షన్లను 4016లకు పెంచి  వికలాంగులకు అండగా నిలిచారని సర్పంచ్ బానోత్ బుజ్జి కాసిం అన్నారు. శుక్రవారం మండలంలోని రోల బండ తండా గ్రామపంచాయతీలో  పెన్షన్లు అందజేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లు బీజేపీ కాంగ్రెస్ పాలిత  రాష్ట్రాలలో లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు,  స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love