- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం కోసం ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ అన్నారు. మంత్రి శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కొండూరు మమత, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



