నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
రాయగిరి గ్రామంలో చిటిక రోగాల టీకాల కార్యక్రమాన్ని జిల్లా ప్రజాసవార్ధక శాఖ అధికారి డాక్టర్ కటకం రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభంలోపు జీవాలకు తప్పనిసరిగా చిటుకు రోగం టీకాలు వేసుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. చిటిక రోగం టీకాలు 100% చిటిక రోగం నుంచి జీవాలను రక్షించుకొని ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు అని అన్నారు. సుమారు 1500 జీవాలకు చిటుకు రోగం టీకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయగిరి పశువైద్యాధికారి డాక్టర్ పి శ్రీకాంత్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సురేష్, గోపాలమిత్ర మధు, గొర్రెల మేకల పెంపొందారుల సంఘం అధ్యక్షులు మన్నెబోయిన రాజలింగం, ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి, కొత్త మల్లేశం, కొత్త నరసింహ, కొత్త శ్రీశైలం, జహంగీర్, ముద్దం కొమురయ్య పాల్గొన్నారు.
చిటుక రోగాల టీకాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



