నవతెలంగాణ హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీకేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివకుమార్ పేరును మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా సీనియర్ నేత పరమేశ్వర బలపరిచినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
జూన్ 3న నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నట్టు కర్ణాటక కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. తాజాగా సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరనున్నారు.


